Share News

Karimnagar: అధికారులు ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:02 AM

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు సంయుక్తంగా ఇసుక రీచ్‌లను తరచుగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

 Karimnagar:  అధికారులు ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలి

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు సంయుక్తంగా ఇసుక రీచ్‌లను తరచుగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, రెవెన్యూ, రవాణా, పోలీసు, మైనింగ్‌ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టాస్కోఫోర్స్‌ బృందాలు ఇసుక స్టాక్‌ యార్డులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీల్లో ఇసుకను నింపాలని, అధికారులు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ ఆలం మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిరంతరం ప్రత్యేక నిఘా పెడు తున్నామని వెల్లడించారు. ఇసుక తరలిస్తున్న లారీలను చెక్‌ పోస్ట్‌ల వద్ద పోలీస్‌ శాఖ సిబ్బంది ప్రత్యే కంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అంశంలో 400 కేసులు నమోదు చేశా మని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ డి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డీఓలు కే మహే శ్వర్‌, రమేష్‌ బాబు, మైనింగ్‌ శాఖ ఏడి రాఘవరెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్‌ చక్రవర్తి, టీజీఎండీసీ పీఓ శ్రీనివాస్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:02 AM