Share News

Karimnagar: హోటళ్లపై అధికారుల దాడులు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:54 PM

హుజూరాబాద్‌ మార్చి 23 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై సోమవారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

 Karimnagar:   హోటళ్లపై అధికారుల దాడులు

హుజూరాబాద్‌ మార్చి 23 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై సోమవారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 12 హోటళ్లపై కేసులు నమోదు చేసి 22 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యాపారులెవరూ గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వాడకూడదన్నారు. కేవలం కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఉష, సురేందర్‌, వినోద్‌, శ్రీనివాస్‌రెడ్డి, అన్వర్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:54 PM