Share News

Karimnagar: పాఠశాల ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:01 AM

భగత్‌నగర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ అశ్విని తానాజి వాకడే అన్నారు.

 Karimnagar:  పాఠశాల ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించాలి

భగత్‌నగర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ అశ్విని తానాజి వాకడే అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని ఎలగందల్‌ విద్యాసంస్థలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు భవనాల మరమ్మ తులు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌; సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను సన్నద్ధం చేయడం అధికారుల బాథ్యత అని అన్నారు. కార్యక్రమంలో టిజిడబ్ల్యుఐడీసీ ఈఈ అశోక్‌కుమార్‌, ప్లానింగ్‌ సమన్వయాధికారి మిలుకూరి శ్రీనివాస్‌, కొత్తపల్లి మండల విద్యాధికారి తుమ్మ ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:01 AM