Karimnagar: గన్నేరువరం నుంచి బ్రిడ్జి నిర్మించాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:31 AM
గన్నేరువరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గన్నేరువరం మండల కేంద్రంలోని ఆది హనుమాండ్ల ఆలయం వద్ద నుంచి ఎలగందులకు వరకు మానేరు డ్యాంపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈఈని కోరారు.
గన్నేరువరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గన్నేరువరం మండల కేంద్రంలోని ఆది హనుమాండ్ల ఆలయం వద్ద నుంచి ఎలగందులకు వరకు మానేరు డ్యాంపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈఈని కోరారు. ఈ మేరకు వారు అధికారులకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం నుంచి బ్రిడ్జి నిర్మిస్తే మండలంతోపాటు బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గన్నేరువరం సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు, ఉపసర్పంచ్ రామంచ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.