Share News

Karimnagar: మహిళా సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:32 AM

చొప్పదండి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

Karimnagar:  మహిళా సంక్షేమానికి పెద్దపీట

- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌ గ్రామంలో గురువారం స్వశక్తి మహిళా సంఘాల నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కోటి మంది మహిళ లను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కర్రె ప్రేమలత, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షు లు ఇప్ప శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొత్తూరి మహేష్‌, నాయకులు ముద్దసాని రంగన్న, వార్డు సభ్యులు, స్వశక్తి సంఘం మహిళలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:32 AM