Karimnagar: ప్రజావాణిలో 144 దరఖాస్తులు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:07 PM
సుభాష్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 144 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
సుభాష్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 144 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజావాణికి ఆటో రిక్షాలో వచ్చిన వృద్ధురాలి వద్దకు వెళ్లి కలెక్టర్ చిత్రామిశ్రా వివరాలు సేకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
- ‘బడిబాట’ గీతం ఆవిష్కరణ
కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడిబాట కార్యక్రమం గీతాన్ని కలెక్టర్ చిత్రామిశ్రా ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి పాఠశాల బాట పట్టాలని, ప్రతి గ్రామం విద్యా వికాసానికి నిలయంగా మారాలనే సంకల్పంతో బడిబాట గీతాన్ని రూపొందించామని చెప్పారు. రిటైర్డ్ ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌రావు, కేబీ శర్మ, రచయిత వెంకటేశ్వర్లు ఈ గీతాన్ని రూపొందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, డీఈవో ఎన్ ప్రశాంత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.