Share News

కమనీయం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:51 AM

బ్రహ్మో త్సవాల్లో భాగంగా మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.

కమనీయం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం

చందుర్తి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బ్రహ్మో త్సవాల్లో భాగంగా మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవంలో భాగం గా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను ఆశీనులను చేశారు. ఆలయ అర్చకులు శ్రీకాంతులచారి ఆధ్వర్యంలో వేద పండితులు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కట్కం మల్లేశం, అలయ కమిటీ చైర్మన్‌ కొండ లక్ష్మ ణ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లాడి రమేష్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్‌, మాజి జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్‌, పొద్దుపొడుపు లింగారెడ్డి, నాయకులు చిలుక అంజిబాబు, తిప్పని శ్రీనివాస్‌, పోతరాజు నగేష్‌, బైరగొని రమేష్‌, గడ్డం తిరుపతిరెడ్డి, ముస్కు పద్మ-మల్లారెడ్డి, బుర్ర శ్రీనివాస్‌, మొకిలె విజేందర్‌, అంబాల శ్రీకాంత్‌, మల్యాల గంగనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:51 AM