కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:38 AM
తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయక మని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయక మని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ పేర్కొన్నారు. బుధవా రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌లు కాళోజీ నారా యణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో సీపీవో శ్రీనివాసచారి, మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్, డీవైఎస్‌ఓ రాందాస్, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా అల్ర్ఫెడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఉమా రాణి, వైశాలి, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్ : తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పోలీస్ కార్యాయలంలో బుధ వారం కాళోజీ నారాయణ జయంతి వేడుకల సందర్భం గా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ భాషా పరిరక్షణకు కాళోజీ విశేషంగా కృషి చేయడంతోపాటు తన కవితలు, రచనలతో ప్రజల్లో ఉద్యమ చైతన్నాన్ని నింపిన మహనీయుడన్నారు. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి చేసిన సేవలు మరువలేనివన్నారు. తెలంగాణ ప్రాంతంలోని కవులు, రచయితలకు ఆయన దర్శకుడిగా, స్ఫూర్తిదాతగా నిలి చారన్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణతో సత్కరించబడిన ప్రజాకవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, సీఐ మధుకర్, మొగిలి, శ్రీలత, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ బెటాలియన్‌లో..
అలాగే సిరిసిల్ల అర్బన్ పరిధి సర్ధాపూర్ శివారులోని 17వ పోలీస్ బెటాలియన్‌లో బుధవారం కాళోజీ జయం తి వేడుకలను నిర్వహించారు. కాళోజీ జయంతి సంద ర్భంగా చిత్రపటానికి కమాండెంట్ పీజేసీ ఛటర్జీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్ కమాండెం ట్ సంజీవరెడ్డి, మినిస్టీరియల్ సిబ్బంది, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.