కాంగ్రెస్ ఆధ్వర్యంలో జువ్వాడి చొక్కారావు వర్ధంతి
ABN , Publish Date - May 29 , 2026 | 12:06 AM
మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు వర్ధంతిని గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో, అనంతరం నగరంలోని వన టౌన పోలీస్ స్టేషన ఎదురుగా ఉన్న చొక్కారావు సర్కిల్ వద్ద నాయకులు నివాళులర్పించారు.
కరీంనగర్ అర్బన, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు వర్ధంతిని గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో, అనంతరం నగరంలోని వన టౌన పోలీస్ స్టేషన ఎదురుగా ఉన్న చొక్కారావు సర్కిల్ వద్ద నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చొక్కారావు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేతగా కొనియాడారు. ఎంపీగా పని చేసిన రోజుల్లో ఢిల్లీ వరకు రైళ్లలో, బస్సులలో ప్రయాణిస్తూ నిరాడంబర జీవితం కొనసాగించారన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీ పెద్దల ముందు గళం విప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్పొరేషన కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన కుమార్, సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అర్బన బ్యాంకు చైర్మన కర్ర రాజశేఖర్, కార్పొరేషన కాంగ్రెస్ నాయకులు వీర దేవేందర్ పటేల్, మడుపు మోహన, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, పడిశెట్టి భూమయ్య, వంగల విద్యాసాగర్, కుంభాల రాజుకుమార్, మాదాసు శ్రీనివాస్, గడప శ్రీనివాస్, పెంట శేఖర్, శ్రీరాముల రమేష్, మార్క రాజు, ఖలీల్, కూన దామోదర్, సిరిపురం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.