5నుంచి ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు
ABN , Publish Date - May 28 , 2026 | 01:03 AM
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని మహలింగే శ్వర ఫంక్షన్‌హాలో జూన్ 5,6,7వ తేది ల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీ య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా మని కార్యకర్తలు సద్వినియోగం చేసు కోవాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కోరారు.
వేములవాడ, మే 27 (ఆంధ్ర జ్యోతి): వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని మహలింగే శ్వర ఫంక్షన్‌హాలో జూన్ 5,6,7వ తేది ల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీ య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా మని కార్యకర్తలు సద్వినియోగం చేసు కోవాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సీపీఐ పార్టీ నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతు లను పార్టీ కార్యకర్తలు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వేములవాడ పట్టణంలో ఉమ్మడి కరీంన గర్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల సన్నా హక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హజరైన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందించాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాం గంతో పాటు పలు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫల మైందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత సీపీఐ నాయకులపై ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కలవేణి శంకర్ నాయకులు మంద సుదర్శన్, పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, చెన్న విశ్వనాథం, బోయిని అశోక్, గుంటి వేణు, కడారి రాములు, మీసం లక్ష్మణ్, పంతం రవి, మంద అనిల్, సోమ నాగరా జు తదితరులు ఉన్నారు.