Share News

కేసీఆర్‌ దోపిడీకి జీవన్‌రెడ్డి వత్తాసు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ దోపిడీ చేశారని మొన్నటివరకు మాట్లాడిన జీవన్‌రెడ్డి ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కేసీఆర్‌ దోపిడీకి జీవన్‌రెడ్డి వత్తాసు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ దోపిడీ చేశారని మొన్నటివరకు మాట్లాడిన జీవన్‌రెడ్డి ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. శుక్ర వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జీవన్‌రెడ్డి ఎవరి మెప్పు పొందడం కోసం మాట్లాడుతున్నారని అన్నారు. జీవన్‌రెడ్డి మాటలు చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలేదని, బీఆర్‌ఎస్‌లో చేరగానే మాటలు మారుస్తున్నాడని అన్నా రు. జీవన్‌రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీలు నీరు ఇచ్చారో ఇంతవరకు లెక్కలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి తీర్పు చదివి మాట్లాడిన ట్లు లేదని హైకోర్టు ఎక్కడా కూడా పీసీఘోష్‌ కమిషన్‌ను తప్పు పట్ట లేదని జీవన్‌రెడ్డి మాట్లాడిన మాటలు అబద్ధమని అన్నారు. హై కోర్టు సాంకేతిక కారణాలు చూపించిందని, వారు ఇచ్చిన నివేదికను ఎక్కడ కూడా తప్పు పట్టలేదన్నారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. వారి అనుమతి లేకుం డా పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.త్వరలోనే మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నూతన ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడతామన్నారు. సీబీఐ విచారణ జరిగితే కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని చూశారని, సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే కేటీఆర్‌, హరీష్‌రావు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తూ వస్తున్నారని అన్నారు. సీబీఐ విచా రణకు హైకోర్టు తీర్పు ఎలాంటి అడ్డం కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నీ చూస్తే ఎవరికి భయం అవుతుందో రాష్ట్రంలో ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లుచేస్తున్నామన్నారు. జీవన్‌రెడ్డి సన్నం బియ్యం పథకం మంచిదని సీఎల్‌పీ మీటింగ్‌లో చెప్పింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. ము ఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాగా పని చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని, బీఆర్‌ ఎస్‌ పార్టీపై రాజీలేని పోరాటం చేసి పార్టీలో చేరిన వారం రోజులకే జీవన్‌రెడ్డి మాట మార్చి మాట్లాడుతున్నారని, రానున్నఎన్నికల్లో రాష్ట్రం లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎవ రు ప్రజాపాలన పోవాలని కోరుకోవడం లేదని, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీ ష్‌లకు తోడుగా జీవన్‌రెడ్డి ప్రజాపాలన పోవాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షు చొప్పదండి ప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ స్వరూపరెడ్డి, ము న్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడేపు చంద్రకళ, కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు వనిత, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మ న్‌ గడ్డం నర్సయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, బొప్ప దేవయ్య, యెల్లే లక్ష్మీనారాయణ, అడేపు ప్రభాకర్‌, తాటిపాముల దామోదర్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:12 AM