Share News

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

ABN , Publish Date - May 18 , 2026 | 12:25 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షలకు రెండు సెషన్లలో నిర్వహించారు.

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు
విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తున్న సిబ్బంది

తిమ్మాపూర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షలకు రెండు సెషన్లలో నిర్వహించారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌ 1 నిర్వహించారు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు తిమ్మాపూర్‌ మండలంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్ష కేంద్రంలో పేపర్‌ 1కు 650 మంది విద్యార్థులకు 640 మంది హాజరయ్యారు. పేపర్‌ 2కు 650 మంది విద్యార్థులకు 639 మంది హాజరయ్యారు. వాగేశ్వరి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో పేపర్‌ 1, పేపర్‌-2 కు 200 మందికి 198 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులను పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు.

Updated Date - May 18 , 2026 | 12:25 AM