జలసిరి పనులు ముమ్మరంగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:39 AM
తెలం గాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్దసంఖ్యలో చేయించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులను పెద్దసంఖ్యలో చేయించాలని కలెక్టర్ గరిమ అగ్ర వాల్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, వీబీజీ రామ్ జీ పనులపై జిల్లా గ్రామీ ణ అభివృద్ధి శాఖ, హౌసింగ్ ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో టెలీకాన్ఫ రెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. భూగర్భజలాల వృద్ధికి వీబీజీరామ్‌జీలో భాగంగా తెలంగాణ జలసిరి కింద జిల్లాలోని అన్ని ప్రభు త్వ కార్యాలయాలు, అన్ని రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పను లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పనులు చేయించాలని సూచించారు. జిల్లాలో పంట కోతలు ముగిసిన వెంటనే పామ్‌పాండ్ పనులు రైతులు మొదలుపెట్టేలా అవగాహన కల్పించి పనులు చేయించాలని స్పష్టం చేశారు. వీబీజీ రామ్‌జీలో తెలంగాణ జలసిరి కింద చేపట్టిన పనుల వివరాలపై కలెక్టర్ ఆరాతీయగా.. ఇప్పటి వరకు ఫామ్ పాండ్‌లు 82 పూర్తి అయ్యాయని, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు 102, మ్యాజిక్ సోక్ పిట్లు 237, రూఫ్ టాప్ హార్వెస్టింగ్ నిర్మాణాలు 18పూర్తిఅయ్యాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లారు. ఆయా పనులను జిల్లాలోని అన్ని మండ లాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ప్రణాళి క ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, ప్రారంభమైన నిర్మాణాలు, పూర్తయిన ఇళ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3969 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని వెల్లడించారు. ముగ్గు పోసిన వారికి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని ఆదేశించారు. రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రి య, లబ్ధిదారుల ఎంపిక, అర్హత కలిగిన లబ్ధిదా రుల వివరాలను ఆరాతీశారు. వివరాలు ఆన్‌లైన్ లో నమోదు చేయాలన్నారు.
వీబీజీ రామ్ జీ పనులపై..
వీబీజీ రామ్‌జీ కింద జిల్లాలో 167 వీవో భవ నాల పనులు మొదలుపెట్టగా, 34 పూర్తయ్యా యని, మిగతా పురోగతిలో ఉన్నాయని తెలిపా రు. అలాగే గ్రామపంచాయతీ భవనాలు 92 చేపట్టగా 35 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. అంగన్‌వాడీ భవనాలు 94చేపట్టగా.. ఇప్పటివర కు 12 పూర్తయ్యాయని మిగతా భవనాల పను లు పురోగతిలో ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.