Share News

Jagtial: అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన యువకుడు

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:08 AM

రాయికల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విధి ఓ కాలును దూరం చేసింది. కానీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది.

Jagtial:  అంతర్జాతీయ వేదికపై సత్తాచాటిన యువకుడు
పతకంతో రావిష్‌ రెడ్డి

- దక్షిణాసియా పారా త్రోబాల్‌ పోటీల్లో రావిష్‌ రెడ్డి ప్రతిభ

రాయికల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విధి ఓ కాలును దూరం చేసింది. కానీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. కృత్రిమ కాలుతోనే సాధన కొనసాగించి అంతర్జాతీయస్థాయికి ఎదిగాడు. శ్రీలంకలో నిర్వహించిన దక్షిణాసియా పారా త్రోబాల్‌ పోటీల్లో కప్పు సాధించి తన సత్తాచాటాడు. రాయికల్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికిచెందిన రావిష్‌ రెడ్డి విజయంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమ వుతున్నాయి. శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా పారా త్రోబాల్‌పోటీల్లో శ్రీలంక,భారత్‌,బంగ్లాదేశ్‌, నేపాల్‌జట్లు పాల్గొనగా, భారత జట్టు తరపున పాల్గొన్న రావిష్‌రెడ్డి అద్భుతప్రతిభ కనబరిచి శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై జట్టు విజయానికి కీలకంగా నిలిచి కప్పు సాధించాడు. స్వగ్రామానికి కీర్తి తీసుకొచ్చాడు. ఒకప్పు డు రోడ్డుప్రమాదంతో క్రీడాజీవితం ముగిసిందనుకున్న యువకుడు ఇప్పుడు అంతర్జాతీయ వేది కపై విజయకేతనం ఎగురవేశాడు.

కల చెదిరినా..

క్రీడా లక్ష్యం వీడలేదు..

భూపతిపూర్‌ గ్రామానికిచెందిన కోమటిరెడ్డి రాజారెడ్డి-భాగ్య దంపతుల చిన్న కుమారుడు రావిష్‌రెడ్డి, బీపీఈడీ పూర్తిచేసి రాయికల్‌లోని ఓ ప్రైవేట్‌పాఠశాలలో వ్యా యామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే వాలీబాల్‌పై ఆసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. 2022లో పోలీస్‌కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయి తే విధుల్లో చేరకముందే గ్రామం నుంచి రాయికల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయప డటంతో వైద్యులు ఎడమ కాలును తొలగించారు.

ఫ వైకల్యాన్ని జయించి..

జాతీయ జట్టులో స్థానం

కృత్రిమ కాలు అమర్చు కున్న తర్వాత ఏడాదిపాటు మానసిక వేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం తో తిరిగివ్యాయామ ఉపాధ్యా యునిగా విధుల్లోచేరాడు. పారా త్రోబాల్‌ సాధన ప్రారంభించాడు.వరంగల్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచి జాతీయస్థాయి పోటీ లకు అర్హత సాధించాడు. రాజస్థాన్‌లోని సింఘానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ జట్టు ఎంపికపోటీల్లో తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఒకరిగా నిలిచాడు. అనంతరం భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:08 AM