Share News

Jagtial: గుట్టలు అమ్ముకున్న చరిత్ర మీది

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:23 AM

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 9 (ఆంధ్ర జ్యోతి): జగిత్యాల చుట్టూ ఉన్న రాజారం, నల్ల గుట్టలను అమ్ముకున్న చరిత్ర మీదని మాజీమంత్రి జీవన్‌ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Jagtial: గుట్టలు అమ్ముకున్న చరిత్ర మీది

జీవన్‌రెడ్డిపై ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 9 (ఆంధ్ర జ్యోతి): జగిత్యాల చుట్టూ ఉన్న రాజారం, నల్ల గుట్టలను అమ్ముకున్న చరిత్ర మీదని మాజీమంత్రి జీవన్‌ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రెచ్చగొట్టే మాటలతో జగిత్యాల అభివృద్దికి జీవన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ప్రజలు అది గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా జీవన్‌రెడ్డి 7నెలలపాటు ఎమ్మెల్సీగా ఉన్నా డని అప్పుడు మెడికల్‌ కళాశాల గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పను లు జరిగేచోట 6కోట్ల రూపా యల మొరం అమ్ముకు న్నట్లు జీవన్‌రెడ్డి ఆరోపిస్తు న్నారని జేఎన్టీయూ గుట్టల్లో కట్టినపుడు మీరెంత మొరం అమ్ముకున్నారని డీసీసీ అధ్య క్షుడు గాజంగి నందయ్య ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్‌ సమిండ్ల వాణి, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌చైర్మన్లు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, దూమాల రాజ్‌కుమార్‌, బాగోజి ముఖేష్‌ ఖన్న కత్రోజు గిరి, సమిండ్ల శ్రీనివాస్‌, అడువాల లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:23 AM