Share News

Jagtial: ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:17 AM

జగిత్యాలరూరల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

 Jagtial:   ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని వంజరిపల్లి గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, కక్ష సాధింపు తన విధానం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్‌ గంగమల్లయ్య, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు బాలముకుందం, సదాశివరావు, మాజీఏఎంసీ చైర్మన్‌ రాధ రవీందర్‌రెడ్డి, సర్పంచులు రాజేందర్‌, వంశీ, కుడుకల లక్ష్మణ్‌, మహేష్‌, ప్రకాశ్‌, మల్లారెడ్డి, సతీష్‌, నరేష్‌, గంగారాం, రవి, భూమారెడ్డి, శ్రీకాంత్‌, శంకర్‌, అధికారులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు కృషి

రాయికల్‌ : మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆలూరులో శుక్రవారం రూ.10లక్షలతో నిర్మించిన మహిళాసంఘ భవనాన్ని, మహిళలు ఏర్పాటు చేసిన స్టీల్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలూరులో ప్లాస్టిక్‌ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయ మన్నారు. మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన నల్ల సాయమ్మ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై చీర కానుకగా అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ఆత్మచైర్మన్‌ కాటిపెల్లి గంగారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మా, సర్పంచులు స్వామి, మోహన్‌, ఉప సర్పంచ్‌ మహేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు దీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, డీసీసీ జిల్లా కార్యదర్శి ముఖీద్‌, తంగెళ్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:17 AM