Share News

Jagtial: జగిత్యాలను హరిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:49 AM

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): పచ్చదనంతో, పరిశుభ్రతతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా మని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ పేర్కొ న్నారు.

 Jagtial: జగిత్యాలను హరిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): పచ్చదనంతో, పరిశుభ్రతతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా మని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ పేర్కొ న్నారు. పట్టణం లోని 14వవార్డులో మున్సిపల్‌ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో భాగంగా మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఫిల్టర్‌బెడ్‌ వద్ద రూ.5లక్షలతో గ్రీన్‌షెడ్‌నిర్మాణానికి భూమిపూజ చేసి, రూ.15లక్షలతో నిర్మిస్తున్న వాటర్‌ట్యాంక్‌ నిర్మాణపనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో తాగునీటిఎద్దడి రాకుండా 15లక్షల లీటర్లతో ధర్మసముద్రం వద్ద, కొత్తబస్టాండ్‌, ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీకళా శాల, సరస్వతి గుట్టపై ఒక్కొక్కటి 16లక్షల లీటర్ల వాటర్‌ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాయికల్‌లో 16లక్షలలీటర్ల వాటర్‌ట్యాంక్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నాణ్యతతగ్గకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్స న్‌ సమిండ్ల వాణిశ్రీనివాస్‌, కమిషనర్‌ సత్య ప్రణవ్‌, డీసీసీఅధ్యక్షుడు గాజంగి నందయ్య, కోఆప్షన్‌సభ్యుడు గట్టు సతీష్‌, కౌన్సిలర్లు స్వప్న గిరిధర్‌, పంబాల సుజాత రాము, మాజీమున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్‌, బాలేశం కర్‌, బండశంకర్‌, కూసరి అనిల్‌,రమణరావు, తాజోద్దీన్‌, శరత్‌రావు, ములాసపు మహేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:49 AM