Share News

Jagtial: వృథా నీటిని వినియోగిస్తే కరువు నుంచి బయటపడొచ్చు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:49 PM

జగిత్యాల టౌన్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకుంటే తెలంగాణను కరువు నుంచి బయటపడేయవచ్చని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు.

 Jagtial: వృథా నీటిని వినియోగిస్తే కరువు నుంచి బయటపడొచ్చు
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకుంటే తెలంగాణను కరువు నుంచి బయటపడేయవచ్చని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ దిగువన కాపర్‌డ్యాం నిర్మిస్తే 20వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకోవచ్చని, నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేస్తే నెలకు 30టీఎంసీల చొప్పున ఐదు నెలల్లో 150టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు. రూ.100కోట్లతో నీటిని ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు దేవేందర్‌ నాయక్‌, కోరుకంటి రాము, తోట హరీష్‌, మాజీ కౌన్సిలర్లు, నాయకులు శీలం ప్రవీణ్‌, గాజుల రాజేందర్‌, కళ్లపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

రాయికల్‌: పట్టణంతోపాటు మండలంలోని అయోధ్య గ్రామంలో పలువురు మరణించగా బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం జీవన్‌రెడ్డి పరామర్శించి ప్రగాఢసానుభూతి తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 11:49 PM