Jagtial: సైబర్ నేరాల నివారణకు అప్రమత్తతే ఆయుధం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:22 AM
జగిత్యాల టౌన్, అక్టోబరు, 31 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు.
జగిత్యాల టౌన్, అక్టోబరు, 31 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల పట్టణంలో ఫ్లాష్‌వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, నకిలి కస్టమర్ కేర్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్లజాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెస్సేజ్‌లకు స్పందించే ముందు ఆగండి ఆలోచించండి ధ్రువీకరించండి అనే మూడు సూత్రాలు పాటించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటన్నే 1930 హెల్‌పలైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, టౌన్ ఇన్‌స్పెక ్టర్ కరుణాకర్, సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, దినేష్, మహేష్, మల్లేష్, సుప్రియ, సైబర్ క్రైమ్ సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.