Share News

Jagtial: ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:30 AM

శుక్రవారం మహిళలు వరలక్ష్మీర వతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయప్రాంగణాలు భక్తు లతో కిటకిటలాడాయి.

Jagtial: ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

మెట్‌పల్లిటౌన్‌/రాయికల్‌/కొడిమ్యాల/కోరుట్ల/మల్లాపూర్‌/ కథలా పూర్‌/జగిత్యాలటౌన్‌/పెగడపల్లి/వెల్గటూర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మండలాల్లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీర వతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయప్రాంగణాలు భక్తు లతో కిటకిటలాడాయి. మెట్‌పల్లి త్రిశక్తిఆలయంలో, రాయికల్‌ లోని అయ్యప్పఆలయం సంతోషిమాత సన్నిధిలో, కోరుట్ల పట్ట ణంలో వాసవీమాత దేవాలయం, శివమార్కండేయ ఆలయం, కాలేజీగ్రౌండ్‌దుర్గాదేవి దేవాలయంలో, జగిత్యాల పట్టణంలోని అరవిందనగర్‌ అభయాంజనేయస్వామి ఆలయం, వాసవీ మాత ఆలయం, అష్టలక్ష్మీఆలయాల్లో, పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూశ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చన, పూజలు చేశారు. వరలక్ష్మీ దేవిని ఇళ్లలో నిలుపుకొని ముత్తయిదువులకు తీపివంటలను, పండ్లు, ఫలహారం వాయినాలుగా అందజేశారు.కొడిమ్యాల మండలం లోని పూడూర్‌లోని మార్కండేయస్వామి ఆలయంలో నవ దుర్గసేవాసమితి ఆద్వర్యంలో దుర్గాదేవి ఉత్సవమూర్తికి గ్రామ శ్రేయస్సుకై పంచామృతఅభిషేకం చేశారు. ఆర్యవైశ్య, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కోరుట్లలో ప్రత్యేక పూజలలో ఐఎంఏ మహిళ విభాగం రాష్ట్ర చైర్మెన్‌ డాక్టర్‌ స్వీతిఅనూప్‌, బీజేపీరాష్ట్రమహిళామోర్చా నాయ కులు పూర్ణిమచౌదరి, గాయత్రి ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:30 AM