Share News

Jagtial: ఖాళీల ‘మనస్సు చలించింది’

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:38 AM

మాసిన బట్టలు, చింపిరి జుట్టుతో తిరుగుతున్న వారిని చూసి చలించి పోయారు. నిత్యం గస్తీ తిరిగే సమయంలో వారు కనిపిస్తుండగా దగ్గరికి పిలిచి వాకబు చేశారు. కానీ ఎప్పడూ ఏ విషయం సరిగా చేప్పే వారు కాదు.

 Jagtial:  ఖాళీల ‘మనస్సు చలించింది’

- పట్టణంలో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌

- 13మంది మానసిక రోగులు ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలింపు

మాసిన బట్టలు, చింపిరి జుట్టుతో తిరుగుతున్న వారిని చూసి చలించి పోయారు. నిత్యం గస్తీ తిరిగే సమయంలో వారు కనిపిస్తుండగా దగ్గరికి పిలిచి వాకబు చేశారు. కానీ ఎప్పడూ ఏ విషయం సరిగా చేప్పే వారు కాదు. ఇలా జగిత్యాల పోలీసులు పట్టణంలో తిరుగుతున్న వారిని చూసి ఏదైనా చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచనలు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు వారందరినీ గుర్తించారు. వారి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఎటువంటి సమాధానం రాక పోవడంతో 13మంది మానసిక రోగులను హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల టౌన్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఖాకీ అంటే కఠినత్వం మాత్రమే కాదు.. కరుణ, మానవత్వం కూడా ఉంటాయిని అని జగిత్యాల పోలీసులు మరోసారి నిరూపించారు. జగిత్యాల పట్టణంలో నిత్యం పోలీసులు సోదాలు నిర్వహి స్తున్న క్రమంలో కొన్నిరోజులుగా కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌, రైతుబజార్‌, బీట్‌లోని వ్యవ సాయ మార్కెట్‌, అంగడిబజార్‌, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు పలు ఆలయాల ప్రాంగణాల్లో రాత్రిసమయంలో పోలీసులు కొం తమంది యాచకులను గుర్తించారు. చింపిరి జుట్టు, మాసినబట్టలతో ఉన్న వారిని సోదాల సమయంలో పోలీసులు వివరాలు అడుగుతుం టే ప్రతిసారి ఏదో చెబుతుండేవారు.

దీంతో జగిత్యాల పట్టణ పోలీసులు వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని సంకల్పించారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ సూచనలు, డీఎస్పీ పురు షోత్తంరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణ ఇన్‌స్పెక్టర్‌ పి కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు జగిత్యాల పట్టణంలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న 15మందిని గుర్తించి పట్టణంలోని చింతకుంటచెరువు ప్రాంగణానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఒక్కొక్క వివరాలు సేకరించి వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని విచా రించారు. కానీ వారి నుంచి సరైన సమాధా నాలు రాలేదు. దీంతో పోలీసులు క్షురకులను పిలిపించి పెరిగిన జుట్టు, గడ్డం తీయించి స్నానాలు చేయించారు. అలాగే వారికి కొత్త బట్టలు అందించి అల్పాహారం అందించి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

వైద్యపరీక్షల్లో 15మందిలో 13మందిని మానసికరోగులుగా, ఇద్దరు యాచకులుగా గుర్తించారు. 13మందిని మానసికరోగులను జగిత్యాలకోర్టులో హాజరుపరిచి అనంతరం ప్రత్యేకవాహనంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రధాన మానసికరోగుల ఆసుపత్రికి తరలిం చారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ వారు తొందరగా చికిత్సకు స్పందించి కోలుకొని వారి కుటుంబ సభ్యులతో గడపాలని ఆకాం క్షించారు. కార్యక్రమంలో పట్టణఎస్‌ఐ సుప్రియ, ట్రాఫిక్‌ ఎస్‌ఐ మల్లేశం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:38 AM