Share News

Jagtial: అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి బేషజాలు లేవు

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:27 AM

జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి బేష జాలు లేకుండా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు.

 Jagtial:  అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి బేషజాలు లేవు

- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌

జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి బేష జాలు లేకుండా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు గురించి 8నెలలుగా కృషి చేస్తున్నానని వెల్లడించారు. స్థల కేటా యింపులో కొంతఆలస్యం అయిందన్నారు. కేంద్రీయ విద్యాలయం సీబీఎస్‌సీ స్కూల్‌ మాత్రమే అని, కొందరు కేంద్రీయ విశ్వవిద్యా లయంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంద న్నారు. గతంలో జగిత్యాలకు నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని కోరానని, కానీ కోరుట్లలో ఏర్పాటు చేశారన్నారు. ఈ నెల12న చల్‌గల్‌లో భూమిపూజ చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మెన్‌ గడ్డం నారాయణరెడ్డి, మాజీమున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్‌, టీపీసీసీ సెక్రెటరీ బండశంకర్‌, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్‌, కోఆప్షన్‌ సభ్యులు గట్టు సతీష్‌, మాజీఏఎంసీ చైర్మెన్‌ దామోదర్‌ రావు, నాయకులు రేపల్లె హరికృష్ణ, చాంద్‌ పాషా, దుమల రాజ్‌ కుమార్‌, బీరం రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

సర్‌పై ప్రజలకు మరింత

అవగాహణ కల్పించాలి..

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రజలకు మరింత అవగాహణను కార్యక ర్తలు కల్పించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పట్టణవిభాగం నేతలు, కార్యకర్తలతో సర్‌ కార్యక్రమ అవగాహణ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జగిత్యాల పట్టణంలో ప్రతివార్డులో సర్‌ కార్యక్రమంపై అవగాహన చేప ట్టాలని, పంపిణీ చేసిన ఓటర్‌ గణన పత్రాలలో సరైన సమాచారం పూరిం చే విధంగా వార్డు ప్రజలతో కలిసి చొరవ తీసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం సర్వేలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్దేశిత గడువులో సర్వే పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి అని అన్నారు. కార్యక్ర మంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌, పట్టణ అధ్యకులు కొత్త మోహన్‌, పట్టణ నాయకులు పార్టీ కోఆర్డినేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:27 AM