Share News

Jagtial: అంజన్న చందనోత్సవానికి వేళాయె

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:20 AM

మల్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): దాదాపు 60ఏళ్ల అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి.

Jagtial:  అంజన్న చందనోత్సవానికి వేళాయె

- నేటి నుంచి ఆరు రోజుల పాటు చందనోత్సాదనం

- కొండగట్టు అంజన్నకు 60ఏళ్ల తరువాత వేడుకలు

- అంజన్న మూలవిరాట్టు దర్శనం నిలిపివేత

- బాలాలయంలోనే స్వామివారి దర్శనం

- ఈనెల 21నుంచి 40రోజుల పాటు నిజరూప దర్శనం

మల్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): దాదాపు 60ఏళ్ల అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకఏర్పాట్లు చేపట్టారు. చందనోత్సవంలో భాగంగా ఆలయంలో స్వామివారి మూలవిరాట్టుకు ఈ నెల20వరకు వైభవంగా చందనోత్సాదనం(సింధూరం తొలగింపు), మహసంప్రోక్షణ తదితర క్రతువులు, హోమాలు, జపాలు, పారాయణాలు ఆలయ ఆచార, సాంప్రదాయాల మేరకు నిర్వహించనున్నారు. నేటి నుంచి సింధూరంను ఆలయ అర్చకులు ప్రత్యేకపూజలతో రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి చెట్ల నుంచి సేకరించిన కలపతో తీయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు పీఠాధిపతులు రానుండగా, నిత్యం త్రికుండాత్మక యజ్ణం నిర్వహి స్తారు. సింఽధూరం తొలగించిన అనంతరం నవంబరు 21నుంచి మండలం 40రోజులపాటు ఆంజనేయస్వామి నిజరూపదర్శన సౌకర్యం కల్పించను న్నారు. సింధూరం తొలగించే ఆరు రోజుల్లో అంజన్న మూలవిరాట్టు దర్శనం ఉండకపోగా బాలాలయంలో స్వామివారి దర్శనానికి ప్రత్యేకంగా కర్రతో చేసిన ఉత్సవమూర్తిని, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, ప్రాణహిత, సరస్వతి, గంగా నదులు, అరేబియా మహాసముద్రం నుంచి జలాలను తీసుకువచ్చారు. చందనోత్సవానికి ఆలయంను సర్వాంగసుందరంగా అలంకరించారు.

ఫ నేడు అంకురార్పన..

చందనోత్సవానికి నేడు అంకురార్పన చేయనున్నారు. గర్భగుడిలో అరణిమథనంతోపాటు స్వస్తివాచనము, బాలాలయకుమ్భావాహనమ్‌ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. బాలాలయంలో కలపతో తయారు చేసిన ఉత్సవమూర్తికి సింఽధూరలేపనం చేసి దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయగా యాగం, పారాయణం కోసం రుత్వికులు కొండగట్టుకు చేరుకున్నారు.

ఫ అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

మూలవిరాట్టుపై చందనం తొలగిస్తారని, ఈ రూప దర్శనానికి చివరి రోజు కావడంతోపాటు శనివారం కావడంతో వేలాదిభక్తులతో అంజన్న క్షేత్రం కిక్కరిసింది. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. రోజంతా భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఓ ముస్లిం కుటుంబం కూడా అంజన్నకు పూజలు చేసింది. చందనోత్సవానికి ఏర్పాట్లు చేశామని, 21నుంచి భక్తులు అంజన్న నిజరూపదర్శనానికి తరలిరావాలని ఈ సందర్భంగా ఈవో అంజనా రెడ్డి కోరారు.

ఫ నిజరూపదర్శనానికి తరలి రావాలి

- మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే

కొండగట్టు క్షేత్రంలో 60ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్న చందోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఆంజనేయస్వామి వారి నిజరూప దర్శనంతో తరించాలి. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. సీఎం, మంత్రులకు, ఎమ్మెల్యేలను కూడా చందనోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించాం. 60 ఏళ్ల ఈ వేడుకలలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది.

Updated Date - Nov 15 , 2026 | 12:23 AM