Jagtial: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:30 AM
జగిత్యాలరూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాలరూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ, తక్కళ్లపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరీశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జారీచేసిన నోటీసుల వివరాలను, విచారణకు ఓటర్లు హాజరవుతున్న తీరు, ప్రజలస్పందనపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కల్లెడ గ్రామంలో నిర్మిస్తున్న వీవో భవనం పనులను, తక్కళ్లపల్లి గ్రామంలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జగిత్యాలల ఆర్డీవో మధుసూధన్, తహసీల్దార్ హకీమ్, ఎంపీడీవో రమాదేవి, పంచాయితీరాజ్‌శాఖ అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.