Share News

Jagtial:విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించాలి

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:09 AM

జగిత్యాల అర్బన్‌, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సంగనబట్ల దినేష్‌ అన్నారు.

Jagtial:విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించాలి
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌, గ్రంథాలయ చైర్మన్‌

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దినేష్‌

జగిత్యాల అర్బన్‌, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటును పెంపొందించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సంగనబట్ల దినేష్‌ అన్నారు. 59వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విజ్ఙాన వ్యాప్తికి, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే యువతకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయిని తెలిపారు. విద్యార్థులు మొబైల్‌ ఫోన్‌లు ఇతర వ్యాపకాలను వదిలి పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రంథాలయాల్లోని సాధారణ విజ్ఞాన పుస్తకాలు, నీతికథలు, మహనీయుల జీవిత చరిత్రలు చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు. గ్రంథాలయ సేవలను పూర్తిస్థాయిల్లో సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచంచారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ సమిండ్లవాణి మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించే అలవాటు, పుస్తక పఠనాన్ని ఒక జీవన విధానంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లావిద్యాధికారి రాము, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, బి ఆనందరావు, లైబ్రేరియన్‌ సంజీవరెడ్డి, కె మల్లయ్య, జె వసంత్‌, శంకర్‌, స్వామి, రాజు, వాణి పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

Updated Date - Nov 21 , 2026 | 12:09 AM