Jagtial: సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:15 AM
మెట్‌పల్లి రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్‌నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు.
మెట్‌పల్లి రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్‌నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని జగ్గసాగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామసర్పంచ్ పుల్ల సాయగౌడ్‌తో కలిసి నూతనగృహాన్ని ప్రారంభించారు. అనంతరం గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గూడూరు తిరుపతి, గోరుమంతుల ప్రవీణ్‌కుమార్, ఉపసర్పంచ్ లక్మచిన్నయ్య, పిడుగు తిరుపతిరెడ్డి, కార్యదర్శి మమత పాల్గొన్నారు.