Jagtial: ఆత్మ గౌరవంతో కూడిన జీవనం అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:25 AM
ధర్మపురి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు ఆత్మ గౌరవంతో కూడిన జీవనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు ఆత్మ గౌరవంతో కూడిన జీవనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొని సుఖ సంతోషాలతో ఆ ఇంటిలో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, హౌసింగ్‌శాఖ పీడీ భాస్కర్, ధర్మపురి ఎంపీడీవో రవీందర్, మండల తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాసారపు బాలాగౌడ్, ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ జక్కు రవీందర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట సుధాకర్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, సర్పంచులు, పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులు పెట్టవద్దు..
ఎండపల్లి: పత్తి కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలంలోని కొత్తపేటలో శాతవాహన జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నేరుగా వచ్చి కేంద్రంలో పత్తిని అమ్ముకొని ప్రభుత్వ ధర పొందాలన్నారు. పత్తి కొనుగోలు విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టవద్దన్నారు. మంత్రి వెంట మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్ యాదవ్, గ్రామ సర్పంచ్ జీరెడ్డి మహెందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.