Share News

Jagtial: చెరువుల పరిరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:49 PM

జగిత్యాల టౌన్‌/అర్బన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెరువుల పరిరక్షణే ధ్యేయంగా, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

Jagtial:  చెరువుల పరిరక్షణే ధ్యేయం
సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌/అర్బన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెరువుల పరిరక్షణే ధ్యేయంగా, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువు అభివృద్ధికి అమృత్‌2.0 పథకం కింద చేపట్టనున్న పనులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణిశ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతె, చింతకుంట, రాయికల్‌ పెద్ద చెరువుల అభివృద్ధికి అమృత్‌2.0 కింద నిధులు మంజురయ్యాయని తెలిపారు. చింతకుంట చెరువు జగిత్యాల ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన నీటివనరని అన్నారు. చెరువులో మురుగునీరు చేరడం ప్రధానసమస్యగా ఉందని, అమృత్‌2.0 కింద మురుగునీటిని మళ్లించి, కాలుష్యాన్ని నివారించేలా సమగ్ర ప్రణాళికతో పనులు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌కమిషనర్‌ సత్యప్రణవ్‌, డీసీసీ అధ్య క్షుడు గజంగి నందయ్య, ఈఈ ఖాన్‌, డీఈ వరుణ్‌, ఎమ్మార్వో రామ్మోహన్‌, టిపిఓ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు బొల్లారపు స్వప్న, రజీయోద్ధిన్‌, అయూబ్‌ఖాన్‌, బడుగు పద్మ రాజేందర్‌, దుమాల రాజ్‌ కుమార్‌, పిట్ట ధర్మరాజు, జుంబర్తి గంగలక్ష్మి రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్లల్లో ఆనందం

జగిత్యాల రూరల్‌ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం కన్నాపూర్‌లో మాజీసర్పంచ్‌ సిరిగిరి తిరుపతి-భాగ్య దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రత్యేకపూజల్లో పాల్గొని దంపతులకు శుభకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సీనియర్‌ నాయకులు సమిండ్ల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ కూతురు రాజేష్‌, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని వంజరిపల్లి, హైదరాపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఐలేని ఎల్లమ్మ, సార్గమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలకు అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - Nov 13 , 2026 | 11:49 PM