Share News

Jagtial: స్మార్ట్‌ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:13 AM

కోరుట్ల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌మీటర్ల బిగింపు నిర్ణయం వెంటనే ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

Jagtial: స్మార్ట్‌ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

- రాస్తారోకో చేసిన నిరసన తెలిపిన తెలంగాణ రక్షణసేన

కోరుట్ల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌మీటర్ల బిగింపు నిర్ణయం వెంటనే ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పట్టణంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన నిరసన తెలిపి రాస్తారోకో చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానంలకు పాలు పడుతున్నాయని అరోపిస్తూ తెలంగాణ రక్షణ సమితి నియోజకవర్గ ఇన్‌చార్జి డాకర్‌ రఘునందన్‌రావు (డాక్టర్‌ రఘు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. స్మార్ట్‌మీటర్ల విధానాన్ని తక్షణం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణసమితి నాయకులు సుకేందర్‌గౌడ్‌, అజ్జార్‌, రేండ్ల రాజన్న, లింగంపల్లి సంజీవ్‌, సాయిరెడ్డి, పలువురు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 12:13 AM