Jagtial: భూభారతి రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:15 AM
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచిం చారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచిం చారు. మండలంలోని బర్దిపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రీ సర్వే పనులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేవివరాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఎందుకు ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో చేసిన సర్వే వివరా లను మరొకసారి సరిచూసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారు లను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు సమస్యలపై గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ వరప్రసాద్, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఫ తొలగించిన ఓట్ల ఆధారాలు చూపిస్తే మళ్లీ నమోదు చేస్తాం..
ఇటీవల నిర్వహించిన సర్ కార్యక్రమంలో తొలగించిన ఓట్లను సంబంధిత వ్యక్తులు తగిన ఆధారాలు తీసుకువస్తే మళ్లీ నమోదు చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సర్ కార్యక్రమ ప్రత్యేక గ్రామసభను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తొలగించిన ఓట్లకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామన్నారు. అనంతరం స్థానిక బిఎల్వోలు గ్రామాల్లో తీసివేసిన ఓట్ల వివరాలను చదివివినిపించారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేష్, సర్పంచ్ బద్దం గోపి, సహకార సంఘచైర్మన్ పవన్, జీపీవోలు, బీఎల్‌వోలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.