Share News

Jagtial: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:13 AM

ధర్మపురి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): యువత చదువు కునే సమయంలో డ్రగ్స్‌జోలికి పోవద్దని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ విద్యార్థులకు పిలుపుని చ్చారు.

 Jagtial:  విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

- రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి

ధర్మపురి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): యువత చదువు కునే సమయంలో డ్రగ్స్‌జోలికి పోవద్దని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ విద్యార్థులకు పిలుపుని చ్చారు. నషాముక్త్‌భారత్‌ కార్యక్రమంలో భాగంగా ధర్మ పురి పోలీసులఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణను డ్రగ్స్‌రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్‌ టీంలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఒకసారి డ్రగ్స్‌కు బానిసయితే దాని నుంచి బయటపడడం సాధ్యం కాదన్నారు. అనుకోకుండా మత్తుపదార్థాలకు బానిసయున వారికి ప్రభుత్వం డీ-అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింద న్నారు. వాటిద్వారా వైద్యచికిత్సతో పాటు కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్ర సాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ చేతన్‌ నితిన్‌, గ్రంథాలయచైర్మన్‌ సంగబట్ల దినేష్‌, ధర్మపురి మున్సిపల్‌ చైర్మన్‌ వేముల నాగలక్ష్మీ, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేష్‌, ఏఎంసీ చైర్మన్‌ చిలుముల లావణ్య. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్‌, పట్టణకాంగ్రెస్‌ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్‌, తదితరులు పాలొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:13 AM