Share News

Jagtial: విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:33 AM

మెట్‌పల్లి రూరల్‌/టౌన్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు.

 Jagtial:   విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలి

మెట్‌పల్లి రూరల్‌/టౌన్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని మేడిపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల, మెట్లచిట్టాపూర్‌ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకు ల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలల పరిసరాలు, వసతులు, పరిశీలించిన అంతనరం విద్యా ర్థులతో మాట్లాడారు. విద్యాభ్యాసం, లక్ష్యాలు, భవిష్యత్‌ ఆశయాలను అడిగి తెలుసుకుని పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వాటిపై బోర్డుపై రాస్తూ పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ తిరుపతి, కౌన్సిలర్‌ అంగడి పురుషోత్తం, మాజీ సర్పంచ్‌ పీసు తిరుపతిరెడ్డి, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:33 AM