Share News

Jagtial: అటవీభూములను పరిశీలించిన స్టేట్‌ విజిలెన్స్‌ అధికారులు

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:35 AM

కొడిమ్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని శనివారంపేట శివారులోని అటవీ భూము లను అటవీశాఖ స్టేట్‌విజి లెన్స్‌ అధికారులు శుక్ర వారం తనిఖీ చేశారు.

Jagtial:  అటవీభూములను పరిశీలించిన స్టేట్‌ విజిలెన్స్‌ అధికారులు

కొడిమ్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని శనివారంపేట శివారులోని అటవీ భూము లను అటవీశాఖ స్టేట్‌విజి లెన్స్‌ అధికారులు శుక్ర వారం తనిఖీ చేశారు. అటవీ భూమిని కొందరు కబ్జాచేసి వందల చెట్లను నరికివేసారన్న ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు. స్టేట్‌ విజిలెన్స్‌ అధికారులు డీఎఫ్‌వో శివయ్య, ఎఫ్‌ఆర్వో మురళీమనోహర్‌, డీఆర్వో ఆసీఫ్‌తో కూడిన ఆరుగురు సభ్యుల బృందం తనిఖీలను నిర్వహించి శాటిలైట్‌ సర్వే చేసారు. తనిఖీ రిపోర్టును ప్రిన్సిపాల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ విన య్‌కుమార్‌కు అందిస్తామని అధికారులు తెలిపారు. విలేజీ మ్యాప్‌, పహాణీల ఆధారంగా భూముల ఆక్రమణపై తనిఖీలను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శనివారంపేట గ్రామశివారులో భూమి ఆక్రమణ ఆరోపణ, చెట్ల నరికివేతపై స్థానిక అటవీఅధికారుల ప్రమేయం ఉందన్న ఫిర్యాదు వచ్చిందన్నారు. చెట్లనరికివేతపై జరిమానా విదించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో కొడిమ్యాల ఇన్‌చార్జు రేంజర్‌ పద్మారావు, కొండగట్టు డీఆర్వో శ్రీనివాస్‌, బీట్‌ అధికారి అశ్విని, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:35 AM