Jagtial: పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:25 AM
జగిత్యాల టౌన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి
జగిత్యాల టౌన్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన 4వ వార్షిక స్పోర్ట్స్‌అండ్‌గేమ్స్ మీట్ 2026 ముగిసింది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నాపద్మావతి, ఎస్పీ అశోక్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి, క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో అదనపుఎస్పీ చేతన్‌నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్స్పెక్టర్‌లు ఆరిఫ్ అలీఖాన్, సుధాకర్, రాజకుమార్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, సైదులు, వేణు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.