Jagtial: స్వచ్ఛతపై ప్రత్యేక గ్రామసభలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:08 AM
జగిత్యాలరూరల్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామాల్లో స్వచ్చతాహీ సేవా, వీబీ జీఆర్‌ఎం ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించారు.
పొరండ్లలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రాజాగౌడ్
జగిత్యాలరూరల్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామాల్లో స్వచ్చతాహీ సేవా, వీబీ జీఆర్‌ఎం ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించారు. పొరండ్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అదనపుకలెక్టర్ రాజాగౌడ్, జిల్లా ఉపవైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, తడి-పొడి చెత్త నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా అదనపుకలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల పంచాయితీఅధికారి కందుకూరి రవిబాబు, ఆయాగ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.