ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:51 PM
ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతిఓటర్‌కు ఇందులో అవ కాశం కల్పించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. మల్యాల మండలం సర్వాపూర్‌లో ఎస్‌ఐఆర్ పత్రాల పంపిణీని శుక్రవారం ఆమె పరిశీలించారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత
మల్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతిఓటర్‌కు ఇందులో అవ కాశం కల్పించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. మల్యాల మండలం సర్వాపూర్‌లో ఎస్‌ఐఆర్ పత్రాల పంపిణీని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్‌వోలు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు పత్రాలు అందించా లని, ఓటర్ల సందేహాలను నివృత్తిచేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్ల నుంచి అందిన పత్రాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి వివ రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
భూముల రీసర్వే వేగవంతం చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన భూసర్వే- రీసర్వే వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వాపూర్‌లో భూముల రీసర్వే అవ గాహన గ్రామసభలో పాల్గొని పలు సూచనలుచేశారు. కార్యక్రమంలో భూమి కొలతల ఏడీ కిషన్‌ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ హన్మంతు, ఆర్‌ఐలు రాణీ, తిరుపతి ఉన్నారు.