Jagtial: భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:24 AM
జగిత్యాలరూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో జిల్లావ్యాప్తంగా భక్తిభావం వెల్లివి రుస్తోంది.
జగిత్యాలరూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో జిల్లావ్యాప్తంగా భక్తిభావం వెల్లివి రుస్తోంది. జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్, హబ్సీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి మండపాలను మాజీమంత్రి, బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతారం గ్రామస్థులు పూల బతుకమ్మలతో పాటు ప్రభుత్వపథకాల పేర్లతో ప్రత్యేక బతుకమ్మలను రూపొందించి ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతారం గ్రామసర్పంచ్ బత్తిని రవీణ- మహేష్ వినూత్న ఆలోచనతో ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జగిత్యాల అగ్రికల్చర్ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబం అని పోలాస కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ అన్నారు. వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో భోధన, బోధనేతర మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
జగిత్యాల టౌన్: పట్టణంలోని అంగడిబజార్ భక్త మార్కండేయ దేవాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్, కమిషనర్సత్యప్రణవ్ అమ్మవారిని దర్శించుకొ ని ప్రత్యేకపూజలుచేశారు. అనంతరం అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. మాజీమున్సిపల్ చైర్ప ర్సన్ అడువాల జ్యోతిలక్ష్మణ్ పట్టణంలోని పలు దుర్గామండ పాలను సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కనక దుర్గాసేవాసమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మీదేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారివద్ద చిన్నారులతో సరస్వతిపూజ, అక్షర భ్యాసం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు కాత్యయని రూపంలో దర్శనం ఇచ్చింది. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు చెట్టి గంగాధర్, సిరికొండ పద్మ సింగారావు, పంబాల సుజాత రాము, మనపురి పవిత్ర మహేష్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: మండలంలోని పలు గ్రామాల్లో అమ్మ వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి, పూజలు అందు కున్నది. మహిళలు కుంకుమ పూజలు చేసి, అమ్మవారిని కీర్తించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బైండ్ల శ్రీకాంత్, కోరుట్ల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దీపక్ రాజ్ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
మెట్పల్లి రూరల్ : మండలంలోని జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యఆరోగ్యశాఖ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వైద్యాధికారులు అంజిత్ రెడ్డి, వొంటెల వాణిరెడ్డి, శివానిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిపారు. వైద్య ఆరోగ్యశాఖ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు.
కథలాపూర్: మండలంలోని సిరికొండలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఇప్పపల్లిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కలికోటలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆదిశ్రీనివాస్ దుర్గాదేవిని దర్శించుకున్నారు.
గొల్లపల్లి : మండలంలో ఆరవరోజు దుర్గాదేవి శ్రీకాత్యా యని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మాలధారులు పెద్దఎత్తున పాల్గొని తమ ఇష్టదైవానికి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గాదేవి నామస్మరణతో, భజనలతో గ్రామాల్లో భక్తిపారవశ్యం వెల్లివిరుస్తున్నది.
మల్లాపూర్ : మండలంలోని రత్నాపూర్లో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లిం చుకున్నారు. గ్రామసర్పంచ్ రాజేందర్ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
రాయికల్ : మండలంలోని రాజనగర్‌లో వారాహిసేవా సమితి ఆధ్వర్యంలో, వీరాపూర్‌లో శ్రీవిజయదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో కుంకుమపూజలను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారు సరస్వతీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.
ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి, అనుబంధ దేవాలయాల్లో దసరా నవరాత్రోత్సవాలు ఆరవ రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ఆకు పచ్చరంగు చీరలో మల్లెపూలు, బిల్వపత్రి దండలు ధరించి కాత్యాయని రూపంలో దర్శనం ఇచ్చింది. మూలనక్షత్రం సంద ర్భంగా సరస్వతీపూజ, పుస్తకపూజ నిర్వహించారు. నవదుర్గ సేవాసమితి ఆఽధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వ హించారు. చాడబుచ్చన్న-పద్మ, హరికృష్ణ-రమ్య దంపతు లు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఆలయ ధర్మకర్తల మండలి మాజీచైర్మన్ జుక్కు రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల : మండలకేంద్రంలోని ఆంజనేయస్వామి ఆల యంలో హన్మాన్సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి ఆరవరోజు శుక్రవారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు భక్తిశ్రద్దలతో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, పుస్తక పూజ లను పూజారి భాస్కర్ నిర్వహించారు. 2వేల మంది గ్రామస్తు లకు అన్నదానం చేశారు.
వెల్గటూర్ : మండలంలోని బీరుసానిలో దుర్గామాత సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. చిన్నారు లకు అమ్మవారిసన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. సాయం త్రం దీపోత్సవం నిర్వహించారు. పాషిగామలో కుంకుమ పూజ నిర్వహించారు.
కన్నుల పండవగా వాహనసేవలు
కోరుట్ల/కోరుట్ల రూరల్ : పట్టణంలో శరన్నవరాత్రి ఉత్స వాలు కన్నులపండవగా సాగుతున్నాయి. అమ్మవారు కాత్యా యిని అవతారంలో దర్శనం ఇవ్వగా వేంకటేశ్వర దేవాల యంలో స్వామివారు గరుడవాహనం, అష్టలక్ష్మి దేవాలయంలో నరసింహస్వామి చిలుకవాహనంపై దర్శనమిచ్చారు. పలు మండ పాల వద్ద కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. రాంనగర్లో బోనాలవేడుకలో ఐఏంఏ రాష్ట్ర మహిళావిభాగం అధ్యక్షురాలు డాక్టర్ స్వీతిఅనూప్ బోనం ఎత్తుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు. పలుగ్రామాలలో ఉత్సవాలలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌రావు కార్యకర్తలతోకలిసి పూజలలో పాల్గొన్నారు.
బీర్పూర్ : బీర్పూర్ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో శుక్రవారం గుట్టపై స్వామివారి పల్లకిసేవని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ప్రారంభమైన పల్లకి సేవకార్యక్రమం దసరా ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తామని ఈవో కిరణ్, చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.
ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో సాయంత్రం శ్రీయోగ, ఉగ్రనరసింహ, శ్రీవేంకటేశ్వరస్వామి వారలను గరుడవాహ నంపై పురవీధుల గుండా ఊరేగించారు.