Share News

Jagtial: ఆవిష్కరణల కేంద్రాలుగా పాఠశాలలు మారాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:48 PM

జగిత్యాల అగ్రికల్చర్‌, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ఆవిష్కరణల కేంద్రాలుగా పాఠశాలలు మారాలని జిల్లావిద్యాధికారి రాము అన్నారు.

 Jagtial:   ఆవిష్కరణల కేంద్రాలుగా పాఠశాలలు మారాలి
బహుమతులతో విద్యార్థులు, అతిథులు

జిల్లా విద్యాధికారి రాము

ఘనంగా 32వ జాతీయస్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ఆవిష్కరణల కేంద్రాలుగా పాఠశాలలు మారాలని జిల్లావిద్యాధికారి రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక టీచర్స్‌ భవన్‌(డీసీఈబీ)లో 32వ జాతీయబాలల సైన్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సిఎస్‌సి) ప్రదర్శన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 136మంది విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులతో ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ప్రతిభను చాటారని జిల్లా విద్యాధికారి రాము, జిల్లాసైన్స్‌ అధికారి మచ్చ రాజశేఖర్‌ తెలిపారు. ఈ ఏడాది సుస్థిరత కోసం విజ్ఞానం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రదర్శనలు నిర్వహించారన్నారు. వ్యర్థాల నిర్వహణ, ఇంధన సంరక్షణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ జ్ఞాన వ్యవస్థల ద్వారా సుస్థిర జీవనం వంటి ముఖ్యమైన అంశాలపై తాము చేసిన పరిశోధనాత్మక ప్రాజెక్టులు, సర్వే నివేదికల నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఈవో రాము మాట్లాడుతూ బాలలు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న సామాజిక, పర్యావరణ సమస్యలను గుర్తించి శాస్ర్తీయ పద్దతిలో పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా డాక్టర్‌ సాయి మధుకర్‌, డాక్టర్‌ రాజు, తిరుపతి, డీవీ కృష్ణ, జీవి రామకృష్ణ, బేతి రామకృష్ణ, శ్రీనివాసులు సహకారం అందించినట్లు తెలిపారు. జిల్లాస్థాయి ప్రదర్శనల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన అయిదుగురు విద్యార్థుల బృందాలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు.

తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాల గర్ల్స్‌ తాటిపెల్లికి చెందిన భూక్యసాయిపల్లవి, వర్షశ్రీ, టీఎస్‌ఎంఎస్‌ కండ్లపెల్లికి చెందిన పేరాల కృష్ణిక, తుమ్మనపెల్లి వైష్ణవి, జడ్పీహెచ్‌ఎస్‌ ధరూర్‌కు చెందిన షేక్‌ అలీపాషా, షేక్‌ అఫ్సీన్‌, జడ్పీహెచ్‌ ధరూర్‌కు చెందిన శృతిలయ, శ్రీజ, అల్ఫోర్స్‌ హై స్కూల్‌కు చెందిన నయనాల రిషిత్‌, ఊటూరి వేదాంశ్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రకటించారు.

Updated Date - Nov 06 , 2026 | 11:48 PM