Jagtial: అసౌకర్యాలకు నిలయాలు రైతువేదికలు!
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:17 AM
కథలాపూర్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల ధరలు, చీడ పీడల నివారణకు సకాలంలో సలహాలు అందించేం దుకు నిర్మించిన మండలంలోని రైతువేదికలు అసౌక ర్యాలకు నిలయాలుగా మారాయి.
- అటెండర్లను నియమించక అస్తవ్యస్తం
- ఏఈవోలు వస్తేనే తెరుచుకుంటున్న వైనం
కథలాపూర్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల ధరలు, చీడ పీడల నివారణకు సకాలంలో సలహాలు అందించేం దుకు నిర్మించిన మండలంలోని రైతువేదికలు అసౌక ర్యాలకు నిలయాలుగా మారాయి. ప్రతీదినం రైతువేది కలు శుభ్రంచేసి తాగునీరు ఏర్పాటు చేసేందుకు అటెం డర్లు కూడా లేకపోవడంతో ఏఈవోలే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఈక్రమంలో క్షేత్రస్థాయి పర్య టనలు చేసుకుని వచ్చి ఏఈవోలే కార్యాలయాలను తెరవాల్సి వస్తోంది. దీంతో రైతులకు వ్యవసాయ సాగుకు సంబంధించి సకాలంలో సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- మౌలిక వసతుల్లేక అవస్థలు..
ప్రభుత్వం ప్రతీమంగళవారం రైతునేస్తం కార్యక్ర మంలో భాగంగా వివిధ పంటల సాగు విధానాలు, సేంద్రీయఎరువుల వినియోగం వల్ల అధికదిగుబడులు సాధించిన రైతుల విజయ గాథలు, సబ్సిడీ పథకాల గురించి ఆన్‌లైన్‌స్ర్కీన్‌పై వివరిస్తుంటారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్య మంత్రి నేతృత్వంలో నిర్వహించే వ్యవసాయ సమావే శాలను రైతులు వీక్షిస్తుంటా రు. ఆయా సమావేశాలకు రైతువేదికలకు వచ్చే రైతుల కు కనీసం తాగేందుకు నీరు లభించని పరిస్థితిఉంది. రైతువేదిక లను నిర్మించిన సమయంలో వీటికి అప్పటి ప్రభుత్వం అటెండర్లను నియమించలేదు. చుట్టూ ప్రహరీ లేకపోగా ఆవరణ పూర్తిగా పొదలతో నిండి అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. పలుమార్లు రైతువేదికల్లో దొంగత నాలు జరిగిన సంఘటనలు ఉన్నా యి. ఆవరణలో సీసీవేయక వానాకాలంలో గడ్డిమొలిచి ఇబ్బందిగా ఉంటోందని ఏఈవోలు వాపోతు న్నారు. ఇప్పటికీ బోర్లుకూడా మంజూరు చేయలేదు. రైతు బంధు, రైతుబీమా, పీఎంకిసాన్, పంటలసాగు సమా చారం, పనిముట్ల సబ్సిడీవంటి వివరాలు తెలుసుకునేం దుకు వచ్చే రైతులు ఏఈఓలు వచ్చేదాకా నిరీక్షించాల్సి వస్తోంది. మండలంలో 19గ్రామాలకుగాను గంభీర్ పూర్, కథలాపూర్, బొమ్మెన, అంబారిపేట, భూషణరా వుపేటలో రైతువేదికలను నిర్మించారు. ఇప్పటికైనా అటెండర్లను నియమించి, మౌలిక వసతులు కల్పిం చేలా ప్రభుత్వం చొరవచూపాలని రైతులు కోరుతు న్నారు.
- సిబ్బంది నియామకం కోసం నివేదించాం..
- కన్నం యోగిత, ఏవో
రైతువేదికల్లో అటెండర్లను నియ మించడంతోపాటు బోర్లు, ప్రహరీ, ఇతరత్రా మౌళికవసతులు కల్పిం చాలని వ్యవసాయశాఖ ఉన్నతాధి కారులకు నివేదించాం. ఎప్పటికప్పు డు రైతులకు ఏఈవోలు అందు బాటులో ఉండేలా చూస్తున్నాం. నాలుగో తరగతి సిబ్బంది ఉంటే సకాలంలో పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. అన్నిరకాల సమావేశాలకు రైతు లను ఆహ్వానిస్తున్నాం.