Jagtial: విషజ్వరాలు వ్యాపించకుండా పటిష్ట చర్యలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:08 AM
జగిత్యాలరూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉపవైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.
జిల్లా ఉపవైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్
జగిత్యాలరూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉపవైధ్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం లోని పొరండ్ల గ్రామంలో ఉచిత ఆరోగ్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉచితవైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ నీలారపు శ్రీనివాస్ మాట్లాడుతూ దోమలవ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిశక్రవారం డ్రైడే నిర్వహించి ఇంటిపరిసరాల్లో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా ప్రభుత్వ ఆస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వెంటనే సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు, కల్లెడ మెడికల్ ఆఫీసర్ సౌజన్య, సర్పంచ్ నక్క హరీష్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్‌వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్ : వర్షకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఉపవైధ్యాధికారి డాక్టర్ ముస్కుజైపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మిలీనియం స్కూల్‌లో శుక్రవారం ఉచిత ఆరోగ్యశిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేశారు. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.