Jagtial: నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:48 PM
జగిత్యాల టౌన్, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
పోలీసు అధికారులకు ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశం
జగిత్యాల టౌన్, నవంబర్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన పెండిగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, నేరస్తులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా పెంచాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించే పీఎం రాహత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన, కేసుల దర్యాప్తులో సమర్థ వంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవికుమార్, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీఖాన్, రామ్ నరసింహరెడ్డి, సుధాకర్, సురేష్ బాబు, శ్రీనివాస్, తిరుపతి, కరుణాకర్, రాజ్ కుమార్, వేణు, సైదులు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.