Jagtial: రేవంత్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:50 AM
బీర్‌పూర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీ జీవన్‌రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
బీర్‌పూర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీ జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారంటీలు, 420హామీలు అమలు వైఫల్యాలపై.. పల్లెవిధ్వంసం, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వనిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం మండలకేంద్రంలో భారీనిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న జీవన్‌రెడ్డిని, జిల్లాపరిషత్ మాజీచెర్‌పర్సన్ వసంతను భారీ ర్యాలీగా వెళ్లి ఎదుర్కొన్నారు. అనంతరం వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పారిశుధ్య పనులను చేప ట్టారు. మురికికాలువలు శుభ్రంచేశారు. చీపుర్లు చేతపట్టుకొని వీధులను, రోడ్లనుఊడ్చారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నాయకుడు చిన్నా రెడ్డిని తొలగిస్తారా?. ఒక్కోమంత్రిని తొలగించే బదు లు మొత్తం మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తే సరిపో తుంది కదా అని ఎద్దేవచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు ఏళ్లు గడుస్తున్నా కొత్త పథకాలు అమలు లేవని, కేసీఆర్ చేసిన పథకాలు కూడా అమ లుచేయడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంకల చేరినట్టు.. సర్పంచ్‌లు ఎమ్మెల్యే సంకల చేరితేనే నిధులు మంజూరు చేస్తున్నారని మండిపడ్డా రు. బీర్‌పూర్‌లో కరువుకు ఎమ్మెల్యే బాధ్యత వహించా లని, ఎమ్మెల్యేకు సోయి లేదు కనీసం మంత్రికైనా సోయి ఉండాలి కదా అన్నారు. రోళ్లవాగుకు షట్టర్లు బిగించలేదు, ఫిల్టర్‌బెడ్ పునరుద్ద రణ చేయలేదన్నారు. రోల్లవాగు తెగిపోయి చేపలుకొట్టుకొని పోయిన గంగపుత్రులకు పరి హారం ఇవ్వలేదన్నారు. ఊరూరా బెల్ట్‌షాపులతో గీతకార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. జిల్లాపరిషత్ మాజీచెర్‌పర్సన్ వసంత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 100రోజుల్లో ఇచ్చిన హామీల ను అమలు చేస్తామని చెప్పి 1000రోజులు అవుతున్నా అమలు చేయలేదని అన్నా రు. ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. కనీ సం పారిశుధ్య కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో హరిచరణ్ రావ్, మాజీఎంపీపీ మసర్తి రమేష్, మాజీ జడ్పీటీసీలు కొల్ముల రమణ, ముక్కశంక ర్, జితేందర్‌యాదవ్, సుభా ష్‌యాదవ్, లక్ష్మణ్‌రావ్, సారంగాపూర్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, బీర్‌పూర్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నేరెల్ల సుమన్, బర్కాం మల్లేశం, బైరీ మల్లేశం పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిచింది
కోరుట్ల రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని అయిలాపూర్ గ్రామంలో పడకవేసిన పారిశుధ్యంపై ఆయన స్థానిక నాయకులతో కలిసి నిరసన చేపట్టి గ్రామంలోని పురవీదుల గుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్నచెత్తను సేకరించి పంచాయతీవాహనంలో వేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూణ్యమని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రామ మాజీసర్పంచ్ పిడుగు రాధసందయ్య, ఉపసర్పంచ్ సౌమ్యకాంత్రి, సర్పంరాజుపూర్ సర్పంచ్ నత్తి రాజుకుమార్, మాజీసర్పంచ్‌లు బాస్కర్‌రెడ్డి, వనతడుపుల అంజయ్య, పలువురు పాల్గన్నారు.