Jagtial: రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:17 AM
రాయికల్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత
రాయికల్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. మండలంలోని ఉప్పుమడుగు గ్రామంలో నాన్‌కెడస్ర్టాల్ రీసర్వే, ఎంజాయ్ మెంట్ రీసర్వే పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో రీసర్వే పూర్తయింది, ఇంకా ఎంతమేర చేపట్టాల్సి ఉంది, పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. రైతులు, గ్రామస్థులు అడిగిన సందేహాలకు తగిన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి
ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. రాయికల్ పట్టణంలో ఎస్‌ఐఆర్ ముసాయిదా గ్రామసభ గురువారం నిర్వహించారు. గ్రామసభల ద్వారా ఓటర్ల జాబితా వివరాలను ప్రజలకు చదివి వినిపించి, పారదర్శకంగా పరిశీలన చేపడుతున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత గడువులోగా స్పందించి అవసరమైన ఆధారాలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో, బీఎల్‌వోలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.