Jagtial: రాళ్లవాగు ప్రాజెక్ట్‌కు జలయోగం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:43 AM
కథలాపూర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) :మండలంలోని భూషణరావుపేట శివారులోని రాళ్లవాగు ప్రాజెక్ట్‌కు
- మత్తడి దూకడంతో రైతుల ఆనందం
కథలాపూర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) :మండలంలోని భూషణరావుపేట శివారులోని రాళ్లవాగు ప్రాజెక్ట్‌కు ఎట్టకేలకు జలయోగం పట్టింది. వానల్లేక రెండు నెలలుగా ఉక్కిరిబిక్కిరవుతున్న రైతులకు ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతున్న క్రమంలో ఎంతో ఉపశమనం కలిగింది. ఈ ప్రాజెక్ట్ కింద మండలంలోని భూషణరావుపేట, కథలాపూర్, పెగ్గెర్ల, ఊట్‌పల్లి గ్రామాలకు చెందిన సుమారు 3500ఎకరాలకు సాగు నీరందుతోంది. ప్రధాన కుడికాలువ వల్ల ఆయాగ్రామాల్లోని చెరువులు కూడా నింపడానికి వీలు కలగనుంది. కాలువ నిండా నీళ్లు పారితే బావులు, బోర్లలో భూగర్భజలాలు పెరగనున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైనగుట్టల మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. మత్తడి నుంచి వచ్చే నీటి అందాలను తిలకించేందుకు పలు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి పెరగనుంది.