Share News

Jagtial: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:20 AM

కోరుట్ల రూరల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యమైన భోజనంను అందించాలని కలెక్టర్‌ గ్రామస్థాయి అధికారులకు సూచించారు.

Jagtial: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- పాఠశాలలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

- జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కోరుట్ల రూరల్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యమైన భోజనంను అందించాలని కలెక్టర్‌ గ్రామస్థాయి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కల్లూర్‌ గ్రామశివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆర్‌డీవో జీవకర్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు డార్మెటరీ నిర్మాణం పనులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులను కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాములు, తహసీల్దార్‌ కృష్ణచైతన్య, ఎంపీడీఓ రామకృష్ణ మండల విద్యాధికారి నరేశంపాల్గొన్నారు. కాగా పాఠశాలకు కోతుల బెడద తీవ్రగా ఉందని... నిరంతరం పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్‌ వనతడుపుల అంజయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకపోయ్యారు. స్పందించిన కలెక్టర్‌ పాఠశాల వెనుక భాగంను పరిశీలించి చెట్లను కోట్టివేసి ప్రహరీ నిర్మాణంకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

- జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మెట్‌పల్లి టౌన్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మెట్‌పల్లి ప్రభుత్వఆసుపత్రిని పరిశీలించిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అవసరమైన మౌళిక సదుపాయాలు, వైద్యపరికరాలు, తదితర ఏర్పాట్లను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు, వైద్యులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:20 AM