Share News

Jagtial: ప్రజాసంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:52 AM

కొడిమ్యాల, సెప్ట్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు.

 Jagtial:  ప్రజాసంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

కొడిమ్యాల, సెప్ట్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన 1000రోజులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా శుక్రవారం మండలకేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ నిర్వహించతల పెట్టిన బైక్‌ర్యాలీని ఆయన ప్రారంభించారు. సుమారు 1000బైక్‌లతో విజ యోత్సవర్యాలీ మేన్‌ రోడ్డు నుంచి పూడూర్‌ గ్రామం వరకు నిర్వహిం చారు. ర్యాలీలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం జీవన్‌రెడ్డి, కేంద్ర సహకారబ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డ్డి, సర్పంచులఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం, సింగిల్‌విండో చైర్మన్లు రాజనర్సింగరావు, రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు నారాయణగౌడ్‌, ముత్యం శంకర్‌గౌడ్‌, మ్యాకల మల్లేశంయాదవ్‌, మండలంలోని వివిద గ్రామాల సర్పంచులు, తదితరులు ఉన్నారు.

కొండగట్టులో సెల్‌టవర్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో నూతన సెల్‌ఫోన్‌ టవర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. మెట్లమార్గంలో ఇండస్‌ టవర్‌ సంస్థ ఆఽధ్వర్యంలో టవర్‌ ఏర్పాటు చేశారు. ఈ టవర్‌ ఏర్పాటుతో భక్తులకు పూర్తిస్థాయిలో సెల్‌ఫోన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైనసేవలు అందుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, సర్పంచ్‌ ఆదిరెడ్డి, ఏఈవో హరిహరనాథ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:52 AM