Share News

Jagtial: జగిత్యాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ధర్నా

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:14 AM

జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా

Jagtial: జగిత్యాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ధర్నా

జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్‌ కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ గేటు వద్ద బైఠాయించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా శిబిరాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘనేతలు మాట్లాడారు. సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్దరించాలని, రెండోపీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌స్కీమ్‌ పకడ్బందీగా అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. ఆరు పెండింగ్‌ డీఏలు విడుదల, పెండింగ్‌ బిల్లుల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం పటిష్టంగా అమలు, శాఖల వారీగా పలు సమస్యల పరిష్కారం వంటి ప్రధాన అంశాలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సుమారు రూ.పదివేల కోట్ల పెండింగ్‌బిల్లులు ఉండడం వల్ల పెన్షనర్ల అవస్థలు ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ కోచైర్మన్లు, నాయకులు ఎండీ వకీల్‌, ఊకంటి అమరేందర్‌రెడ్డి, బోయినపల్లి ఆనందరావు, భైరం హరికిరణ్‌, తుంగూరి సురేష్‌, హరి అశోక్‌కుమార్‌, కారబూజ రవీందర్‌, రవీందర్‌రెడ్డి, గోవర్ధన్‌, గంగారాజం, అత్తినేని శ్రీనివాస్‌, యాళ్ల అమర్నాథ్‌రెడ్డి, శివరామకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్‌, సంతోష్‌రెడ్డి, బోగరమేష్‌, రాంచంద్రం, కొలిచాల రవీందర్‌, వేల్పులస్వామి, నునవత్‌రాజు, రమాదేవి, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, మహ మూద్‌, సాహెద్‌బాబు, రవిచంద్ర, రవీందర్‌, రవికుమార్‌, రాజేందర్‌, రాజేశం, సుగుణాకర్‌, హన్మంత రెడ్డి పాల్గొన్నారు

బీఆర్‌ఎస్‌ నేతల సంఘీబావం..

జగిత్యాల కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ధర్నా శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీచైర్‌పర్సన్‌ దావవసంత సురేశ్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభు త్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 28 , 2026 | 12:14 AM