Share News

Jagtial: వృద్ధుల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిది

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:24 AM

జగిత్యాల అగ్రికల్చర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిది అని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు.

Jagtial: వృద్ధుల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిది

అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, పీడీ రఘువరణ్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వృద్ధుల హక్కుల పరిరక్షణ బాధ్యత మనందరిది అని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సెర్ప్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల పట్ల అశ్రద్ద చేసిన, వారిని సంతానం పట్టించుకోకపోయినా, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 409వృద్ధ సంఘాలు, 4228 సభ్యులు ఉన్నారని, ఇంకా చేరాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత మాట్లాడుతూ వృద్ధుల్లో వచ్చే శారీరక సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య కేంద్రాల సేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఆయా మండలాల్లో ఉత్తమసేవలు అందించిన సీనియర్‌ స్వశక్తి సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సెర్ప్‌ అదనపుపీడీ సునీత, జిల్లా కోఆర్డినేటర్‌ మహేష్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఆమని, జిల్లా వయోవృద్ధుల హక్కుల సంఘం అధ్యక్షుడు హరిఅశోక్‌కుమార్‌, డీపీయంలు నాగేశ్వర్‌రావు, రమేష్‌, నారాయణ, జిల్లా సమాఖ్య బాధ్యులు రజిత, రూపకళ, ఏపీయంలు తదితరులున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:24 AM