Share News

Jagtial: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పేద ప్రజలకు లబ్ధి

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:27 AM

రాయికల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పేదప్రజలకు లబ్ధి చేకూరిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

Jagtial: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పేద ప్రజలకు లబ్ధి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

రాయికల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పేదప్రజలకు లబ్ధి చేకూరిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని సింగర్రావుపేటలో వోల్టేజీ సమస్య పరిష్కారానికిగాను ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ కాటిపెల్లి గంగారెడ్డి, సర్పంచ్‌ కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్లు తంగెళ్ల రమేష్‌ ఏనుగు మల్లారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఏడీఈ సింధూర్‌ శర్మ, కోల శ్రీనివాస్‌, ఏఈ నవీన్‌, మాజీ సర్పంచ్‌ రాము, రవి గౌడ్‌, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని భూపతిపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కార్యవర్గ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అభినందించి సన్మానించారు. తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కోల శ్రీనివాస్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌ రావు, మహేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నిమ్మల శేఖర్‌ రెడ్డి, డైరెక్టర్లు రౌట్ల కిష్టయ్య, అచ్చ గంగు, మంత్రి జలంధర్‌, తదితరులు పాల్గొన్నారు.

పేదవారి సొంతింటి కల సాకారం..

ఇందిరమ్మ ఇల్లు పథకంతో పేదవారి సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో సయ్యద్‌ హసీనా బేగం, అహ్మద్‌ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఏనుగు గంగుఅంజయ్య, ఆత్మ చైర్మన్‌ కాటిపెల్లి గంగారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు తంగెళ్ల రమేష్‌, శేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఏనుగు మల్లారెడ్డి, ఉప సర్పంచ్‌ రంజిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:27 AM