Share News

Jagtial:ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:03 AM

జగిత్యాల టౌన్‌/జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, అనంతరం పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ అన్నారు.

Jagtial:ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యం

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాల టౌన్‌/జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, అనంతరం పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలోని నాయీబ్రాహ్మణ సంఘంలో రూ.10లక్షలతో నిర్మించిన అదనపు కార్యాలయ భవనాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయీబ్రాహ్మణ సెలూన్లకు ఉచితవిద్యుత్‌, అర్హులైన కుటుంబాలకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచితవిద్యుత్‌ అందుతోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గజంగినందయ్య, కౌన్సిలర్లు వేములశ్రీనివాస్‌, దుమాల రాజ్‌కుమార్‌, మ్యాన పురి పవిత్రమహేష్‌, సంఘం అధ్యక్షుడు పెండెం మహేందర్‌, టీపీసీసీ కార్యదర్శి బండశంకర్‌, మాజీమున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, కోఆప్షన్‌ సభ్యుడు గట్టు సతీష్‌, మాజీకౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, వీరబత్తినీ శ్రీనివాస్‌, నాయకులు కొత్తమోహన్‌, రాచర్ల విజయ్‌, మానాల కిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:03 AM